HomeTelugu Trendingచికిత్స కోసం అమెరికాకు సమంత!

చికిత్స కోసం అమెరికాకు సమంత!

Samantha not suffering any

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత ఆరోగ్యంపై ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవున్న సంగతి తెలిసిందే. ఆమె చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే వాటిపై ఆమె మేనేజర్‌ స్పందిస్తూ.. సమంత పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు వెల్లడించారు.

తాజాగా మరోసారి సమంత హెల్త్‌పై వార్తలు వినిపిస్తున్నాయి. కొంతకాలంగా సమంత ‘పాలీమర్‌ ఫోర్స్‌ లైట్‌ ఎరప్షన్‌’ అనే చర్మ వ్యాధితో బాధపడుతున్నట్లు, దీంతో మరోసారి షూటింగ్‌లకు బ్రేక్‌ ఇచ్చి చికిత్స కోసం అమెరికా వెళ్లడానికి సిద్ధపడినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

తాజాగా ఈ విషయంపై సమంత మేనేజర్‌ స్పందిస్తూ.. ఆవిడ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు అని చెప్పారు. ఆమెకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు అని వెల్లడించారు. అయితే ఆమె అమెరికా ఎందుకు వెళ్తున్నారు అనే విషయంపై స్పందించలేదు. కాగా సమంత నటించిన యశోద, శాకుంతలం విడుదలకు రెడీగా ఉన్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!