HomeTelugu Trendingఅల్లు అర్జున్‌ ప్రశంసలపై సమంత ట్వీట్‌

అల్లు అర్జున్‌ ప్రశంసలపై సమంత ట్వీట్‌

samantha responds allu arju

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత నాగ చైతన్యతో విడాకుల తర్వాత కెరీర్‌ పరంగా జెడ్‌ స్పీడ్‌లో దూసుకెళ్తుంది. టాలీవుడ్‌, బాలీవుడ్‌,హాలీవుడ్‌ అనే తేడా లేకుండా వరుస సినిమాలను ప్రకటిస్తూ.. బిజియెస్ట్‌ హీరోయిన్‌గా మారిపోయింది. తాజాగా అల్లు అర్జున్‌ ఫస్ట్‌ పాన్‌ ఇండియా మూవీ ‘పుష్ప’లో ‘ఊ అంటావా’ అనే స్పెషల్‌ సాంగ్‌లో సందడి అనిపించింది. ఈ పాట ఇప్పడు యూట్యూబ్‌లో టాప్‌ 100 మ్యూజిక్ వీడియోలలో మొదటి స్థానంలో ఉండడం విశేషం.

తాజాగా జరిగిన ‘పుష్ప’థ్యాంక్స్‌ మీట్‌లో అల్లు అర్జున్‌ సమంత గురించి మాట్లాడుతూ… ‘స్పెషల్ సాంగ్ చేసిన సమంతకు థ్యాంక్స్. మీరు ఈ పాటను ఎంత నమ్మారో గానీ.. మేం మిమ్మల్ని ఇంత నమ్ముతున్నామని, మీరు మమ్మల్ని నమ్మారు.. మా మీద నమ్మకంతో చేశారు కదా? ఆ నమ్మకానికి థ్యాంక్స్.సెట్‌లో నీకు ఎన్ని అనుమానాలు వచ్చాయో ఉన్నాయో నాకు తెలుసు.. తప్పా? ఒప్పా? అని ఆలోచించావ్.. నన్ను నమ్ము అని నేను ఒక్క మాట చెప్పడంతో ఇంకో ప్రశ్న కూడా వేయలేదు. చేసేశావ్. అది నా గుండెను తాకింది. ఏది అడిగినా కూడా ఆలోచించకుండా చేశావ్.. నీ మీద నాకు ఇంకా గౌరవం పెరిగింది. ప్రపంచంలోనే నెంబర్ వన్ సాంగ్‌గా యూట్యూబ్‌లో నిలబడటం అంటే మామూలు విషయం కాదు’ అని బన్నీ సమంతపై ప్రశంసల వర్షం కురిపించాడు. తనను అభినందిస్తూ.. బన్నీ చేసిన వ్యాఖ్యలకు సమంత రిప్లై ఇచ్చింది. బన్నీ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ను షేర్‌ చేస్తూ.. ‘ఇకపై నేను మిమ్మల్నిఎప్పడూ నమ్ముతాను’ అని ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!