HomeTelugu Trendingచైతన్య గురించి ఆ సీక్రెట్‌ చెప్పిన సమంత

చైతన్య గురించి ఆ సీక్రెట్‌ చెప్పిన సమంత

6 19ప్రముఖ నటి మంచు లక్ష్మి ఓ ఆసక్తికరమైన రియాలిటీ షోను హోస్ట్ చేస్తున్నారు. దాని పేరే ‘ఫీట్ అప్ విత్ ది స్టార్స్’. ఈ షో వూట్ యాప్‌లో ప్రసారం కానుంది. ఈ షోకు సంబంధించిన ఎపిసోడ్స్ ఈ నెల 23 నుంచి అందుబాటులో ఉంటాయని మంచు లక్ష్మి తెలిపారు. బాలీవుడ్ లో కాఫీ విత్ కరణ్ కు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు మరలా అదే తరహా షోను స్టార్ట్ చేసింది.

ఇందులో భాగంగానే సమంతను ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో సమంత.. చైతు మధ్య బెడ్ రూమ్ సీక్రెట్ ను రాబట్టింది. ఇద్దరి మధ్య ఉన్న ప్రేమకథ గురించి చెప్పమని అడిగినపుడు సమంత కామ్ గా ఉందంట. అయితే, పెళ్ళికి ముందు లివింగ్ రిలేషన్ షిప్ గురించి తెలుసు అని ప్రేమకథ గురించి చెప్పాలని పట్టుబట్టింది మంచు లక్ష్మి. దీంతో పాటు పెళ్లి తరువాత ఏ మూడు సంగతులు బెడ్ రూమ్ మ్యాటర్స్ ని మార్చాయి? అని ప్రశ్నిస్తే.. చైతు గురించిన ఓ టాప్ సీక్రెట్ ను సామ్ బయటపెట్టిందట. ఇద్దరి మధ్య పిల్లో ఎప్పుడు అడ్డం వస్తుందని చెప్పింది. తలగడ చైతు మొదటి భార్య అని ఇద్దరి మధ్య పిల్లో గొడవ జరుగుతుందని చెప్పింది సామ్. ఇవే కాదు ఈ టాక్ షో లో ఇంకా చాలా ఉన్నాయట. అవేంటో తెలియాలంటే షో ప్రసారం జరిగే వరకు ఆగాల్సిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu