HomeTelugu Trendingతన ప్రేమను చాటుకున్న సమంత.. ఫొటో వైరల్‌

తన ప్రేమను చాటుకున్న సమంత.. ఫొటో వైరల్‌

2స్టార్‌ హీరోయిన్ సమంత తన పెంపుడు కుక్క హష్‌ను ఒళ్లో కూర్చోబెట్టుకుని లాలిస్తూ.. మూగజీవాల పట్ల ప్రేమను చాటుకున్నారు. ‘జంతువులను ప్రేమించినంత వరకు… ఏ ఒక్కరి ఆత్మ కూడా పరిపూర్ణం కానట్లే.. స్పందించే హృదయం లేనట్లే’ అనే క్యాప్షన్‌తో సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఈ ఫొటో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న అక్కినేని ఇంటి కోడలు సమంత‌.. సోషల్‌ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన సినిమా అప్‌డేట్లతో పాటు కుటుంబ విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటారు.

ఈ క్రమంలో హష్‌ను ముద్దు చేస్తున్న ఫొటోను సమంత సోమవారం తన ఇన్‌స్టా అకౌంట్లో షేర్‌ చేశారు. ఆరున్నర లక్షలకు పైగా లైకులు సాధించిన ఫొటోపై అక్కినేని అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘అమల బ్లూక్రాస్‌ ద్వారా మూగజీవాలను అక్కున చేర్చుకుంటున్నారు. ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో భాగమయ్యే అక్కినేని కోడలు సమంత కూడా మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. మూగజీవాలపై ఆమెకు ఉన్న ఈ ప్రేమను ఈ విధంగా ఆవిష్కరించారు’ అంటూ అభినందిస్తున్నారు. కాగా తన భర్త నాగ చైతన్యకు జోడీగా నటించిన మజిలీ మంచి విజయం సాధించడంతో పాటుగా.. కొరియన్‌ మూవీ రీమేక్‌.. ఓ బేబీ సక్సెస్‌తో సామ్ ఫుల్‌ జోష్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu