HomeTelugu Trendingడీజే టిల్లుతో సమంత!

డీజే టిల్లుతో సమంత!

Samantha with DJ Tillu
స్టార్‌ హీరోయిన్‌ ఇటీవలే నటించిన చిత్రం ‘శాకుంతలం’. ఈ సినిమాతో భారీ ఫ్లాప్ చవిచూసింది సమంత. ప్రస్తుతం సమంత వరుస సినిమాలతో బిజీగా ఉంది. హిందీలో వరుణ్ ధావన్‌తో ‘సిటడెల్’ వెబ్ సిరీస్‌ చేస్తుంది. మరోవైపు విజయ్ దేవరకొండ తో ‘ఖుషి’ సినిమాలో నటిస్తుంది. ఈ రెండు ప్రాజెక్ట్స్ సెట్స్‌పై ఉండగా, తాజాగా మరొక సినిమాకు సామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

లేడీ డైరెక్టర్ నందిని రెడ్డితో తర్వాతి సినిమా చేయనుండగా.. ఇందులో సమంతకు జంటగా డీజే టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ నటించనున్నాడు. గతంలో సమంత, సిద్ధార్థ్ జంటగా ‘జబర్దస్త్’ మూవీ తెరకెక్కించింది నందిని రెడ్డి. కానీ ఆ సినిమా వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత సమంత లీడ్‌ రోల్‌లోనే రూపొందించిన ‘ఓ బేబీ’ చిత్రం మాత్రం వర్కవుట్ అయ్యింది. ఇదే క్రమంలో మూడోసారి సమంత, నందిని రెడ్డి కాంబినేషన్ రిపీట్ కాబోతోంది.

రీసెంట్ ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని నందిని రెడ్డి ప్రస్తావించారు. తన తదుపరి ప్రాజెక్ట్ సిద్ధు జొన్నలగడ్డతోనే అని ధృవీకరించారు. అయితే సంబంధిత వ్యక్తుల నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. నందినీ రెడ్డి దర్శకత్వంలో.. సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నటించిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. ఈ సినిమా గురువారం విడుదల కానుంది. ఈ క్రమంలో ఆమె ప్రమోషన్స్‌లో పాల్గొంటుంది.

ఆస్తికరంగా ‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu