HomeTelugu TrendingPawan Kalyan Birthday సెలబ్రేషన్స్ ఈసారి అంతకు మించి

Pawan Kalyan Birthday సెలబ్రేషన్స్ ఈసారి అంతకు మించి

Pawan Kalyan Birthday special surprises for fans
Pawan Kalyan Birthday special surprises for fans

Pawan Kalyan Birthday Celebrations:

పవన్ కల్యాణ్ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కల్యాణ్ సెప్టెంబర్ 2న తన పుట్టినరోజు జరుపుకోనుండగా, ప్రపంచ వ్యాప్తంగా ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

పవన్ కల్యాణ్ సినిమాల విషయానికి వస్తే, సెప్టెంబర్ 2, 2024న పలు కీలక అప్‌డేట్స్ రానున్నాయి. మొదటగా, క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న హరి హర వీరమల్లు నుంచి ఒక కొత్త పోస్టర్‌తో పాటు సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.

తరువాత, హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు సంబంధించి షూటింగ్ ప్రారంభం తేదీతో కూడిన ఒక కొత్త పోస్టర్‌ను విడుదల చేయనున్నట్టు సమాచారం.

ఇక చివరిగా, సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజీ సినిమా నుంచి ఒక క్రేజీ వీడియో సెప్టెంబర్ 2న విడుదల కానుంది. సాహో ఫేమ్ సుజీత్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల కానుంది అనే అధికారిక ప్రకటన కూడా రేపే బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువ.

పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమాలలో ఒకటి అయిన గబ్బర్ సింగ్ కూడా రీ రిలీజ్ అవుతుండగా.. అడ్వాన్స్ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడు అవుతున్నాయి. హరీష్ శంకర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.

మరోవైపు ఫ్యాన్స్ కూడా Pawan Kalyan Birthday అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పుట్టినరోజు అంటూ తుఫాన్ అనే సాంగ్ కూడా బాగా వినిపిస్తోంది. ఇంతకు ముందు తో పోలిస్తే ఈ ఏడాది పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా గర్వంగా వేడుక చేసుకోనున్నారు అని చెప్పుకోవచ్చు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu