HomeTelugu Big Storiesకార్తికేయ 'హిప్పీ'లో 'కొబ్బరిమట్ట' పై జోక్స్‌.. నిర్మాత ఆగ్రహం

కార్తికేయ ‘హిప్పీ’లో ‘కొబ్బరిమట్ట’ పై జోక్స్‌.. నిర్మాత ఆగ్రహం

5 20‘కొబ్బరిమట్ట’ నిర్మాత సాయి రాజేష్‌.. యంగ్‌ హీరో కార్తికేయపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . సంపూర్ణేష్‌ బాబు ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘కొబ్బరిమట్ట’. అయితే ఈ సినిమాలోని ఓ సన్నివేశాన్ని కార్తికేయ నటించిన ‘హిప్పీ’ మూవీలో వాడారు. థియేటర్‌లో కార్తికేయ ‘కొబ్బరిమట్ట’ లోని ఓ సన్నివేశాన్ని చూస్తూ పగలబడి నవ్వుకుంటూ ఉంటారు. ఈ సన్నివేశాన్ని రాజేశ్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ..

‘హాయ్‌ కార్తికేయ. మీరు నటించిన ‘హిప్పీ’ సినిమాలో ‘కొబ్బరిమట్ట” చిత్రాన్ని, సంపూర్ణేష్‌ బాబుని, నన్ను టార్గెట్‌ చేసిన సన్నివేశాన్ని చూశాను. ఇందుకు నేను ‘హిప్పీ’ సినిమాను తీసిన దర్శకుడిని తప్పుబట్టను. కానీ ఈ సన్నివేశాన్ని రాసిన రచయితకు, నటించిన మీకు తెలియాల్సింది ఏంటంటే.. ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి సినిమాను, సహ నటులను గౌరవించండి’ అని పేర్కొన్నారు.

ఈ విషయంపై సంపూర్ణేష్‌బాబు కూడా స్పందించారు. ‘కార్తికేయ.. నా మీద వేసిన జోక్‌కి ఫర్వాలేదు. తిట్లు నాకు కొత్త కాదు. కానీ విడుదలవ్వని సినిమా గురించి తప్పుగా మాట్లాడటం న్యాయం కాదు. మేం ప్రేమించి, ఎన్నో కష్టాలు పడి తీసిన సినిమా ‘కొబ్బరిమట్ట’. ఇలా చేయడం బాధాకరం’ అని పేర్కొన్నారు. అయితే దీనిపై కార్తికేయ స్పందించాల్సి ఉంది. కాగా ఈ ‘కొబ్బరిమట్ట’ సినిమా ఆగస్ట్‌ 2న విడుదల కానుంది.

https://twitter.com/sairazesh/status/1152868464656150529

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!