HomeTelugu Trendingఈనెల ఆఖరిలో బజార్‌ రౌడీ సినిమా!

ఈనెల ఆఖరిలో బజార్‌ రౌడీ సినిమా!

Sampoornesh babu

టాలీవుడ్‌ నటుడు బర్నింగ్‌ స్టార్‌ సంపూర్ణేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘బజార్ రౌడీ’. కె.ఎస్ క్రియేషన్స్ పతాకంపై బోడెంపూడి కిరణ్ కుమార్ సమర్పణలో వసంత నాగేశ్వరరావు తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సంధిరెడ్డి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ కు కూడా అమోఘమైన స్పందన లభించింది. మరోసారి పూర్తి మాస్ క్యారెక్టర్ లో సంపూర్ణేష్ బాబు కనిపించనున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. మరుధూరి రాజా మాటలు రాసిన ఈ సినిమాకు గౌతంరాజు ఎడిటింగ్ చేశారు. ఏ విజయ్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. ఈ సినిమాను ఈ నెలాఖరులో విడుదల చేస్తామంటున్నారు దర్శకనిర్మాతలు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను తెలిపేందుకు త్వరలోనే ఓ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లుగా మేకర్స్‌ ప్రకటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu