‘పుడింగి నెంబర్’ గా సంపూర్ణేశ్‌


టాలీవుడ్‌ నటుడు సంపూర్ణేశ్ బాబు మరోసారి హీరోగా ప్రేక్షకులను నవ్వించడానికి సిద్ధమవుతున్నాడు. ఆ సినిమా పేరే ‘పుడింగి నెంబర్ ‘. సంపూర్ణేశ్ బాబు హీరోగా ఈ రోజు ఈ సినిమా హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలను జరుపుకుంది. కేఎస్ రామారావు క్లాప్ ఇవ్వగా.. భీమనేని శ్రీనివాసరావు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ముహూర్తపు సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ సినిమాతో మీరావలి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. పలు చిత్రాలలో హాస్యనటిగా మెప్పించిన విద్యుల్లేఖ రామన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది.. మరో హీరోయిన్‌గా సాఫీ కౌర్ పరిచయమవుతోంది. పోసాని … అజయ్ ఘోష్ ముఖ్యమైన పాత్రలను పోషించనున్న ఈ సినిమా, ఈ రోజు నుంచే రెగ్యులర్ షూటింగు జరుపుకోనుంది. జూలైలో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates