ఆ ట్రోల్స్‌ బాధించాయి: విద్యుల్లేఖ

టాలీవుడ్‌లో లేడీ కమెడియన్స్‌ గుర్తింపు తెచ్చుకుంది విద్యుల్లేఖ రామన్‌. సినిమాల్లో హీరోయిన్లకు స్నేహితురాలిగా పాత్ర పోషిస్తూ, కామెడీ పండిస్తూ నటిగా తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే సినిమాలకు గ్యాప్‌ ఇచ్చిన ఆమె ఓ ఫొటోను షేర్‌ చేసి అందరికి షాక్‌ ఇచ్చింది. విద్యుల్లేఖ ఈ ఫొటోలో బక్కచిక్కనట్లు కనిపించింది. దీంతో ఆమె ఫొటోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందించారు. కొందరూ ఆమెను ట్రోల్‌ చేయడం ప్రారంభిస్తే మరికొందరి తన ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. అయితే సుదీర్ఘ గ్యాప్‌ తర్వాత ఆమె సంపూర్ణేశ్‌ బాబుతో ‘పుడింగ్‌’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇటీవల సంబంధించిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన లావు తగ్గడంపై నెటిజన్లు చేసిన ట్రోల్స్‌పై స్పందించింది.

‘ఏంటీ సన్నబడుతున్నావ్‌.. ఇక కమెడియన్‌గా చేయవా? హీరోయిన్‌గానే చేస్తావా?’ అంటూ తనపై వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తూ ట్రోల్‌ చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే నేను లీడ్ రోల్ చేస్తూ కామెడీ చేయాలని అనుకున్నాను. అలా నేను కలలు కంటున్న సమయంలోనూ కలలాగా ఈ మూవీ ఆఫర్ వచ్చిందంటూ విద్యుల్లేఖ చెప్పుకొచ్చింది. ఇది సంపూర్ణేశ్ బాబు పక్కన.. ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ అని ఆమె పేర్కొంది. ఇక తను అధిక బరువు ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చాయని, అందుకే తన వ్యాయమం, వర్కవుట్స్‌ చేసి సన్నబడినట్లు తెలిపింది.

CLICK HERE!! For the aha Latest Updates