‘చిత్రం’ సీక్వెల్స్‌ ప్రకటించిన తేజ


టాలీవుడ్‌లో చిత్రం సినిమాతో దర్శకుడుగా పరిచయమైయ్యాడు. నితిన్, ఉదయ్ కిరణ్, రీమా సేన్, సదా, కాజల్, నవదీప్, సుమన్ శెట్టి వంటి నటీనటులతో పాటు ఆర్పి పట్నాయక్ వంటి సంగీత దర్శకులని కూడా ఇండ‌స్ట్రీకు ప‌రిచ‌యం చేశాడు. తేజ చివ‌రిగా ‘నేనే రాజు నేనే మంత్రి’ అనే సినిమాతో మంచి హిట్ కొట్టారు.

తేజ ఈ రోజు బ‌ర్త్ డే సంద‌ర్భంగా తాజాగా చిత్రం సినిమా సీక్వెల్‌ను ప్రకటించాడు. చిత్రం 1.1 పేరుతో రూపొంద‌నున్న ఈ చిత్రం 2021లోనే షూటింగ్ జ‌రుపుకోనుంది. తొలి పార్ట్‌కు సంగీతం అందించిన ఆర్పీ ప‌ట్నాయ‌క్ ఇప్పుడు సీక్వెల్‌కు సంగీత ద‌ర్శ‌కుడిగా ప‌ని చేయ‌నున్నారు. న‌టీన‌టులు ఎవ‌రనే దానిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది. అయితే తేజ తెర‌కెక్కించిన చిత్ర మూవీ 2000 జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రాగా, గ‌త ఏడాది జూన్ 16కు 20 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుంది. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన మూవీ ఉదయ్ కిరణ్, రీమాసేన్, ఆర్.పి.పట్నాయక్, రసూల్ ఎల్లోర్ వంటి వారి కెరీర్‌కు పునాది వేసింది.

CLICK HERE!! For the aha Latest Updates