HomeTelugu Trendingఎన్టీఆర్‌కు విలన్‌గా పొలిటికల్‌ లీడర్‌!

ఎన్టీఆర్‌కు విలన్‌గా పొలిటికల్‌ లీడర్‌!

8 14
టాలీవుడ్‌ హీరో యంగ్ టైగర్‌ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్ మూవీలో రామ్ చరణ్‌ మరో హీరోగా నటిస్తున్నాడు. పీరియాడిక్ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం 2021 జనవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నటించబోతున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంయుక్తంగా నిర్మించబోతున్న ఈ మూవీకి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతుండగా.. ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్‌ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కించాలని త్రివిక్రమ్‌ భావిస్తున్నారట. దీనిలో భాగంగా ఈ చిత్రంలో ఓ క్యారెక్టర్‌ కోసం బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు సంజయ్‌ దత్‌ను చిత్రబృందం సంప్రదించిందని టాక్‌. పొలిటికల్‌ ధ్రిల్లర్‌గా తెరకెక్కబోతున్న ఈ మూవీలో విలన్‌ పొలిటికల్‌ లీడర్‌గా కనిపించబోతున్నారట. ఇక ఆ పాత్ర కోసం సంజయ్‌ సరిగ్గా సరిపోతారని భావించిన త్రివిక్రమ్‌.. ఆయనను సంప్రదించబోతున్నట్లు సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu