HomeTelugu Trending'ఏక్ మినీ కథ' నుంచి 'సామిరంగా..' లిరికల్‌ వీడియో

‘ఏక్ మినీ కథ’ నుంచి ‘సామిరంగా..’ లిరికల్‌ వీడియో

Saamiranga Video Song With
‘పేపర్ బాయ్’ ఫేమ్ సంతోష్ శోభన్, కావ్యా థాపర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ”ఏక్ మినీ కథ”. ‘డజ్ సైజ్ మ్యాటర్?’ అంటూ.. మొదలైన ప్రమోషన్‌ ఆకట్టుకున్నాయి. ఫస్ట్ లుక్ నుంచి టీజర్‌ తో సహా ఈ సినిమాపై ఆసక్తిని కలిగించారు. అలానే ఇటీవల విడుదలైన ‘ఈ మాయలో..’ లిరికల్ సాంగ్ కూడా మంచి స్పందన తెచ్చుకుంది. ఈ క్రమంలో శ్రీరామనవమి సందర్భంగా తాజాగా సెకండ్ సాంగ్ ‘సామిరంగా..’ లిరికల్ వీడియో రిలీజ్ అయింది.

ఈ లిరికల్ వీడియో ఫన్నీగా ఉంటూ అందరిని ఆకట్టుకుంటోంది. కొత్త దర్శకుడు కార్తీక్ రాపోలు తెరకెక్కిస్తున్న ‘ఏక్ మినీ కథ’ సినిమాని యూవీ క్రియేషన్స్ అనుబంధ సంస్థ యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై రూపొందిస్తున్నారు. మ్యాంగో మాస్ మీడియా వారు సమర్పిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి కథను అందించారు. ఇక ఈ సినిమాలో శ్రద్ధాదాస్ కీలక పాత్ర పోషిస్తుండగా.. బ్రహ్మాజీ, సుదర్శన్, సప్తగిరి, హర్షవర్ధన్ ఇతర పాత్రల్లో కనిపిస్తున్నారు. ఏప్రిల్ 30న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు కానీ కొవిడ్ నేపథ్యంలో వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.

శ్రీరామనవమి స్పెషల్‌ పోస్టర్లు

Recent Articles English

Gallery

Recent Articles Telugu