కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తాను: సారా అలీఖాన్‌

గతేడాది తెరంగేట్రం చేసిన సైఫ్‌ అలీఖాన్‌ కూతురు సారా అలీఖాన్‌ కెరీర్‌ ప్రస్తుతం జోరు మీదుంది. ‘కేదార్‌ నాథ్’, ‘సింబా’ చిత్రాలతో ఆమె మంచి విజయాలు అందుకున్నారు. బాలీవుడ్‌లోకి రాకముందు ఆమె ఎక్కువగా చదువు మీదే దృష్టి పెట్టారు. హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్‌ సబ్జెక్టుల్లో డిగ్రీ పట్టా అందుకున్నారు. ఆమె ఇటీవల ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో తన భవిష్యత్తు గురించి ఆసక్తి కరమైన విషయాలు పంచుకున్నారు.

‘మన దేశ రాజకీయాలంటే నాకెంతో గౌరవం. నేను కొలంబియాలో చదువుకోవడానికి మా కుటుంబం ఎంత ముఖ్య కారణమో రాజకీయాల పట్ల ఆసక్తి కూడా అంతే కారణం. భవిష్యత్తులో కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తాను. కానీ అర్ధంతరంగా సినిమాలు వదులుకుని కాదు. నన్ను ఇక్కడి ప్రజలు ఆదరిస్తున్నంత వరకు సినీరంగంలోనే ఉంటాను. రాజకీయాల్లోనూ నేనేంటో నిరూపించుకుంటా. సినీరంగంలో వీలైనంత ఎక్కువ రోజులుండి తర్వాత రాజకీయాల్లోకి వెళ్తాను’ అని అన్నారు.