HomeTelugu Trending'సర్కారు వారి పాట' న్యూ రిలీజ్‌ డేట్‌ ఇదే

‘సర్కారు వారి పాట’ న్యూ రిలీజ్‌ డేట్‌ ఇదే

Sarkaru vaari
సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు నటిస్తున్న తాజా చిత్రం‘సర్కారు వారి పాట’. ఇప్పటి వరకు సంక్రాంతి బరిలో ఉన్న ఈ చిత్రం తాజాగా.. వేసవి బరిలోకి వెళ్లింది. వచ్చే ఏడాది జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం వాయిదాపడింది. 2022 ఏప్రిల్‌ 1న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు పోస్టర్‌ని విడుదల చేసింది. ఈ మేరకు పోస్టర్‌ని విడుదల చేసింది.

పరశురామ్‌ డైరెక్షన్‌లో.. బ్యాంకు కుంభకోణం నేపథ్యంలో భారీ అంచనాలు నడుమ రూపొందుతోంది. ఇప్పటి కనిపించని సరికొత్త లుక్‌లో మహేశ్ సందడి చేయనున్నారు. ఆయన హెయిర్‌ స్టైల్‌, టాటూలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ సినిమాలో కీర్తి సురేశ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీమూవీ మేకర్స్‌, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, 14 రీల్స్ ప్లస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu