HomeTelugu Trending2022 సంక్రాంతి బరిలో 'సర్కారు వారి పాట'

2022 సంక్రాంతి బరిలో ‘సర్కారు వారి పాట’

Sarkaru Vaari Paata Relea

టాలీవుడ్ వరుసగా సినిమాల విడుదల తేదీలను ప్రకటిస్తున్నారు. అనేక పెద్ద సినిమాలు షూటింగ్ ప్రారంభించాయి. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్‌ బాబు కొత్త చిత్రం ‘సర్కారు వారి పాట’ ఎప్పుడు రిలీజ్ కానుందో వెల్లడించింది మూవీ యూనిట్‌. ఈ సినిమా 2022 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఓ ప్రకటనలో తెలిపారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో మహేష్‌ బాబు తాళాలగుత్తి పట్టుకుని ఉన్న స్టిల్ అభిమానులను ఆకట్టుకుంటుంది.

పరశురామ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తోంది. మహేశ్ బాబుకు చెందిన జీఎంబీ ఎంటర్టయిన్ మెంట్స్ తో పాటు మైత్రీ మూవీ మేకర్స్, 14 ప్లస్ రీల్స్ ఈ సినిమా నిర్మాణంలో పాలుపంచుకుంటున్నాయి. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ దుబాయ్‌లో జరుపుకుంటుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu