‘సత్తిగాని రెండెకరాలు’ ట్రైలర్‌

‘పుష్ప’ ఫేమ్ జగదీశ్ ప్రధానలో నటిస్తున్న చిత్రం ‘సత్తిగాని రెండెకరాలు’. అభినవ్ దండ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. కొల్లూరు నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. వెన్నెల కిశోర్ .. భవాని శ్రీ ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఈ నెల 26వ తేదీ నుంచి ఈ సినిమా ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంటును కొంతసేపటి క్రితం నిర్వహించారు. వెంకీ కుడుముల .. హను రాఘవపూడి, సుహాస్, సత్యదేవ్, అనుదీప్ తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు. కామెడీకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ కట్ చేసిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది.

సత్తిగాడు ఆటో నడుపుతూ తన కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఉంటాడు. ఒకానొక సందర్భంలో అతను తనకి ఉన్న రెండెకరాల పొలాన్ని అమ్ముకోవలసి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో అతను ఏం చేస్తాడు? పర్యవసానంగా ఏం జరుగుతుంది? అనేది కథ. డార్క్ కామెడీ జోనర్లో సాగే ఈ కథ ఎంతవరకూ మెప్పిస్తుందనేది చూడాలి.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

CLICK HERE!! For the aha Latest Updates