HomeTelugu Trendingఆర్య.. అఖిల్‌ హీరోయిన్‌ పెళ్లి చేసుకోబోతున్నారా!

ఆర్య.. అఖిల్‌ హీరోయిన్‌ పెళ్లి చేసుకోబోతున్నారా!

9 26అక్కినేని ‘అఖిల్’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన సయేషా సైగల్‌, తరువాత కోలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కోలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ భామ త్వరలో పెళ్లిపీటలెక్కేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. గజనీకాంత్ సినిమాలో తనతో కలిసి నటించిన హీరో ఆర్యను సయేషా పెళ్లాడనుందట.

ఆర్య, సయేషాలు ప్రేమలో ఉన్నట్టుగా చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై ఆర్యగానీ, సయేషాగానీ ఇంతవరకు స్పందించలేదు. తాజాగా మార్చి 10న వీరి వివాహం అంటూ కోలీవుడ్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరి ఇప్పటికైన ఈ జంట స్పందిస్తుందేమో చూడాలి. ప్రస్తుతం సయేషా, సూర్య హీరోగా తెరకెక్కుతున్న కాప్పాన్‌ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆర్య కూడా కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu