పోలింగ్ బూత్ లో సెల్పీ .. యువకుడు అరస్ట్‌

పోలింగ్ బూత్ లో ఓ యువకుడు అత్యుత్సాహం ప్రదర్శించి పోలీసులకు చిక్కాడు. రాజేంద్రనగర్ లోని ఉప్పరపల్లికి చెందిన శివగౌడ్ పోలింగ్ బూత్ లో సెల్పీ దిగి దాన్ని సోషల్ మీడియాలో ఉంచారు. వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అతడిని ఉప్పర్‌పల్లికి చెందిన శివశంకర్ గా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. పోలింగ్ బూత్ లోకి దర్జాగా మొబైల్ ఫోన్ తీసుకుని వెళ్లి ఓటు వేశాడు. దీంతో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. ఓటు వేసేటప్పుడు గోప్యత పాటించాలని, ఫొటో తీసినా, సెల్ఫీ దిగినా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.