విజయ్‌ దేవరకొండ మహేష్‌ మూవీ?


టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్ బాబు ఒక వైపున హీరోగా వరుస సినిమాలు చేస్తూనే .. మరో వైపున నిర్మాతగాను వ్యవహరిస్తున్నాడు. తన సినిమాలకు మాత్రమే నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించే మహేశ్ బాబు, ఈ మధ్యనే రూట్ మార్చాడు. ఓ మాదిరి బడ్జెట్ లో ఇతర హీరోల సినిమాలను కూడా నిర్మిస్తున్నాడు. అలా ప్రస్తుతం ఆయన అడివి శేష్ హీరోగా ‘మేజర్’ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ చాలావరకూ జరుపుకుంది.

ఇక ఆ తరువాత సినిమాను ఆయన విజయ్ దేవరకొండ హీరోగా నిర్మించనున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన చర్చలు కూడా పూర్తయ్యాయని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టును గురించిన వివరాలను వెల్లడి చేయనున్నారని చెబుతున్నారు. ఆ వెంటనే కార్తీ హీరోగా ఒక సినిమాను నిర్మించడానికి మహేశ్ బాబు సన్నాహాలు చేయిస్తున్నాడని అంటున్నారు. తెలుగుతో పాటు తమిళంలోను ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఆయన వున్నాడని చెబుతున్నారు. ఇటు హీరోగానే కాదు .. అటు నిర్మాతగా కూడా మహేశ్ బాబు తన సత్తా చాటనున్నాడు.