బోయపాటి సినిమాలో సీనియర్ స్టార్ హీరో!

‘సరైనోడు’ చిత్రంతో ఘన విజయం అందుకున్న దర్శకుడు బోయపాటి ప్రస్తుతం బెల్లంకొండ
శ్రీనివాస్ హీరోగా ఓ సినిమా రూపొందిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుక
జరిగింది. నవబర్ 16 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నిర్వహించనున్నారు. అయితే
ఈ సినిమాలో కీలక పాత్ర కోసం సీనియర్ స్టార్ హీరో శరత్ కుమార్ ను తీసుకున్నట్లు సమాచారం.
శరత్ కుమార్ తెలుగు ప్రేక్షకులను సుపరిచితులే.. నటుడిగా ఆయన తెలుగు, తమిళ
బాషల్లో మంచి పేరుంది. ఈ చిత్రానికి మార్కెట్ పరంగా కూడా ఆయన ఉపయోగపడతారని
ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో శరత్ కుమార్, శ్రీనివాస్ తండ్రిగా కనిపించనున్నారు.
ఈ పాత్ర సినిమాకు కీలకంగా, ఎమోషనల్ గా ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో శ్రీనివాస్
సరసన రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనుంది.