200 కోట్లు పోగొట్టుకున్నా!

టాలీవుడ్ లో యంగ్ హీరోల డిమాండ్ పెరగడంతో ఒకప్పట్టి హీరోలందరూ కూడా ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, విలన్లుగా మారిపోతున్నారు. హీరో రాజశేఖర్ కూడా విలన్ అవతారం ఎత్తడానికి ప్రయత్నించారు కానీ పాత్రలు నచ్చకపోవడంతో ఆయన అంగీకరించలేదు. ప్రస్తుతం ఆయన ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘గరుడ వేగ’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే నెల 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మించారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన రాజశేఖర్ ఎమోషనల్ అయ్యారు.

‘ఈ సినిమా ట్రైలర్ కి 5 మిలియన్ వ్యూస్ వచ్చాయని తెలిసి నాతో పాటు నా తల్లి కూడా సంతోషింది. కానీ మరుసటి రోజునే ఆమె చనిపోయారు. రాంగ్ టైమ్ లో రాంగ్ సినిమాలు చేయడం వలన బాగా నష్టపోయాను. దాదాపుగా 200 కోట్ల విలువైన ఆస్తులను అమ్మేశాను. అది చూసి మా అమ్మ బాగా బాధపడేది. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఇలా నష్టపోయి ఇలా చివరి దశలో ఏమి లేకుండా చేసుకుంటారు.. నేను కూడా అలా అవుతానేమో అని ఆమె బాధ పడేది’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.