Homeతెలుగు Newsసీనియర్ నటి సుబ్బలక్ష్మి కన్నుమూత

సీనియర్ నటి సుబ్బలక్ష్మి కన్నుమూత

Actress Subba Lakshmi

R Subbalakshmi: ప్రముఖ సీనియర్ నటి సుబ్బలక్ష్మి(87) కేరళలోని కొచ్చిలో మృతిచెందారు. ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం ఆమె మృతి చెందినట్టు మనవరాలు సౌభాగ్య వెంకటేశ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు. సుబ్బలక్ష్మి తెలుగు, తమిళం, మలయాళంతోపాటు బాలీవుడ్‌లోనూ నటించి తనదైన ముద్ర వేసుకున్నారు. సుబ్బలక్ష్మి మరణవార్త విని సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది.

నటి సుబ్బలక్ష్మి దాదాపు 75 సినిమాల్లో నటించారు. ఆమె చివరిగా కోలీవుడ్ స్టార్ విజయ్ నటించిన ‘బీస్ట్’ మూవీలో నటించారు. తెలుగులో అక్కినేని నాగచైతన్య నటించిన ‘ఏమాయ చేశావే’, కల్యాణ రాముడు చిత్రాల్లోనూ నటించారు. పలు సీరియళ్లతో పాటు ఆమె ఎన్నో వాణిజ్య ప్రకటనల్లోనూ కనిపించారు. మలయాళంలో అమ్మమ్మ పాత్రలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి.

చిత్ర పరిశ్రమలోకి రాకముందు జవహర్ బాలభవన్‌లో సంగీత, నాట్య శిక్షకురాలిగా పనిచేశారు. ఆల్ ఇండియా రేడియోలోనూ సేవలందించారు. రేడియోలో దక్షిణాది నుంచి వచ్చిన తొలి మహిళా కంపోజర్‌గా రికార్డులకెక్కారు. డబ్బింగ్ ఆర్టిస్ట్‌నూ సుబ్బలక్ష్మి పనిచేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu