HomeTelugu Trendingసాయి పల్లవి మూవీ అప్‌డేట్

సాయి పల్లవి మూవీ అప్‌డేట్

Sai Pallavi latest
ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన ముద్దుగుమ్మ సాయి పల్లవి. ఈ బ్యూటీ శ్యామ్‌ సింగరాయ్‌, గార్గి సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్‌ సంపాదించుకుంది. కంటెంట్‌ ఓరియెంటెడ్‌ సినిమాలకే తొలి ప్రాధాన్యత ఇచ్చే సాయిపల్లవికి ఫ్యాన్‌ ఫాలోయింగ్ చాలా ఎక్కువ.

సాయి పల్లవి సినిమా రాక కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సాయిపల్లవి సిల్వర్ స్క్రీన్‌పై కనిపించక ఏడాదిన్నరకుపైగా అవుతోంది. 2022 జూన్‌లో విడుదలైన విరాటపర్వం సాయిపల్లవి చివరి సినిమా. ఆ తర్వాత గార్గి సినిమా గతేడాది జులైలో ఓటీటీలో విడుదలైంది.

సాయిపల్లవి ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్‌తో కలిసి ఓ మూవీలో నటిస్తోంది. వర్కింగ్ టైటిల్ SK21గా రూపొందుతోంది. SK21 వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల కానున్నట్టు సమాచారం.

SK21 చిత్రానికి రాజ్‌కుమార్‌ పెరియసామి డైరెక్టర్. ఈ మూవీలో విశ్వరూపం ఫేం రాహుల్ బోస్‌ విలన్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే సాయిపల్లవి కశ్మీర్‌ లొకేషన్‌లో దిగిన స్టిల్స్‌ నెటిజన్లను ఇంప్రెస్‌ చేస్తున్నాయి.

తెలుగులో చందూమొండేటి డైరెక్షన్‌లో నాగచైతన్య సరసన తండేల్‌ మూవీలో నటిస్తోంది సాయిపల్లవి. లవ్‌స్టోరీ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న రెండో సినిమా ఇది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu