HomeTelugu Trending'ఎన్టీఆర్‌ 30'లో..బుల్లితెర నటి

‘ఎన్టీఆర్‌ 30’లో..బుల్లితెర నటి

ntr 30

ఎన్టీఆర్ హీరోగా.. స్టార్ కొర‌టాల శివ డైరెక్షన్‌లో పాన్ ఇండియా మూవీగా ‘NTR 30’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ ఇలా అందరూ మంచి ఫేమ్‌ ఉన్నవాళ్లే ఈ సినిమాకు ప‌ని చేస్తున్నారు. అలాగే హాలీవుడ్ టెక్నీషియ‌న్స్ సైతం వ‌ర్క్‌చేస్తున్నారు. ఈ క్రమంలో బుల్లితెర నటి చైత్రా రాయ్ NTR 30లో న‌టించ‌నున్న‌ట్లు ఆమే స్వయంగా వెల్లడించింది. ఇప్ప‌టి వ‌ర‌కు బుల్లి తెర‌పై ప‌లు సీరియ‌ల్స్ ద్వారా మెప్పించిన మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు ఇప్పుడు టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇంత‌కీ ఆమె ఎన్టీఆర్ 30లో చేయ‌బోతున్న రోల్ ఏంటో తెలుసా!.. సినిమాలో ప్ర‌తి నాయ‌కుడిగా అల‌రించ‌నున్న సైఫ్ అలీఖాన్ భార్య పాత్ర‌లో చైత్రా రాయ్ క‌నిపించ‌నుంది.

చైత్రా రాయ్ NTR 30 ఇప్ప‌టికే జరిగిన షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొన్నారు. సైఫ్ అలీఖాన్‌తో క‌లిసి న‌టించారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. ఎన్టీఆర్‌, సైఫ్ అలీఖాన్ వంటి గొప్ప స్టార్స్‌ను సెట్స్‌లో చూడ‌గానే చాలా ఎగ్జ‌యిట్ అయ్యాను. అలాంటి గొప్ప స్టార్స్‌తో క‌లిసి న‌టించే అవ‌కాశం రావ‌టం నా అదృష్ట‌మ‌నే చెప్పాలి. ఇంకా ఆ జ్జాప‌కాల‌తో మేఘాల్లో తేలిపోతున్నాను.. అంటూ తాజాగా ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చింది చైత్రా రాయ్‌. ప్ర‌స్తుతం NTR 30 షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో జ‌రుగుతోంది. ఎన్టీఆర్‌, సైఫ్ అలీఖాన్‌, చైత్రా రాయ్‌ల‌పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌.

ఈ సినిమాతో బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ క‌పూర్.. టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది. ఆర్ఆర్ఆర్ త‌ర్వాత ఎన్టీఆర్ న‌టిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తున్న‌ట్లు కూడా ప్ర‌క‌టించేశారు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌, యువ‌సుధ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై హ‌రికృష్ణ‌.కె, మిక్కిలినేని సుధాక‌ర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఆస్తికరంగా ‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu