HomeTelugu Big Stories"శకుంతలా దేవి'' ట్రైలర్‌

“శకుంతలా దేవి” ట్రైలర్‌

Shakuntala Devi Trailerబాలీవుడ్‌ నటి విద్యాబాలన్ నటించిన తాజా చిత్రం ‘శకుంతలా దేవి’. హ్యూమన్ కంప్యూటర్ శకుంతలా దేవీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తన అద్భుతమమైన “కాలిక్యులేషన్ మైండ్” వల్ల ప్రసిద్ధి చెందిన శకుంతలా దేవి పాత్రలో విద్యాబాలన్ ఒదిగిపోయారు. శకుంతలా దేవి ‘ట్రైలర్ 2 నిమిషాల 47 సెకన్లు ఉంది. ఇక రెండు నిముషాల నలభై సెకండ్స్ ఉన్న ఈ ట్రైలర్ ఓ వైపు ఆద్యంతం వినోదాత్మకంగా.. మరోవైపు ఎమోషనల్ గాను ఉంది. శకుంతలా దేవి “హ్యూమన్ కంప్యూటర్”‌గా పేరు ఎలా సంపాదించుకుంది అనేది ట్రైలర్‌లో మీరు స్పష్టంగా తెలుస్తోంది. అను మీనన్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాను సోనీ పిక్చర్స్ విక్రమ్ మల్హోత్రా సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా నిర్మాతలు ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయనున్నారు. శకుంతలా దేవి చిత్రం జూలై 31న విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu