HomeTelugu Trendingమహేష్‌ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ..

మహేష్‌ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ..

Heroine replaced in sarkar
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురాం డైరెక్షన్‌లో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టాక్‌. మహేష్ కెరీర్లో 27వ చిత్రంగా రానున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్-జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్ – 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థలు కలిసి నిర్మించనున్నాయి. అంతేకాక ఈ సినిమాకు పాన్ ఇండియా క్రేజ్ రావాలని బాలీవుడ్ నటులను తీసుకుంటున్నారట. ఇక విలన్ పాత్రలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ నటించబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమా హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుందని గత కొద్దీ రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో కీర్తి సురేష్ కాదని మరోవార్త వైరల్‌ అవుతోంది. మహేష్ సరసన బాలీవుడ్ భామను తీసుకోవాలని భావిస్తోందట మూవీ యూనిట్‌. ఈ సినిమాలో మహేష్ అక్క పాత్ర చాలా కీలకంగా ఉండనుందట. అందుకోసం బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్‌ను తీసుకోనున్నట్లు సమాచారం. అదే విధంగా హీరోయిన్ కూడా బాలీవుడ్ భామ అయితేనే బావుంటుందని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో రిలీజ్‌ కానుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులను పూర్తి చేసి.. షూటింగ్‌కు రెడీ అవుతోంది చిత్రబృందం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu