విజయ్ నుండి మరో పాట!

తమిళంలో హీరోలు తమ సినిమాల్లో అప్పుడప్పుడు పాటలు పాడుతూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో తెలుగులో కూడా ఇలా పాడే హీరోల సంఖ్య పెరిగిపోతుంది. తమ అభిమాన హీరో పాట పాడుతున్నారని తెలిసిందంటే అభిమానులకు పండగే.. వారు ఎంతగానో ఆ పాటలను ప్రోత్సహిస్తూ ఉంటారు. హీరో విజయ్ కూడా గతంలో కొన్ని పాటలు పాడారు. ఇప్పుడు మరోసారి పాడడానికి రెడీ అవుతున్నారు. అది కూడా ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ డైరెక్షన్ లో..

విజయ్ తన 61వ చిత్రాన్ని అట్లీ కుమార్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ సినిమా రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ ను విజయ్ తో పాడించనున్నాడు రెహ్మాన్. ఇదే గనుక నిజమైతే ఇప్పటివరకు విజయ్ సినిమాలకు పని చేసిన ప్రతి సంగీత దర్శకుడి సారధ్యంలోనూ విజయ్ ఒక్కో పాట పాడిన రికార్డ్ సొంతం చేసుకుంటాడు.