HomeTelugu Trendingఅఫిషియల్: మహాసముద్రంలో శర్వానంద్‌

అఫిషియల్: మహాసముద్రంలో శర్వానంద్‌

Sharwanand next movie is mఆర్‌ఎక్స్ 100 సినిమా తో యువతను ఆకట్టుకున్న డైరెక్టర్‌ అజయ్ భూపతి. ఇక ఈ సినిమా తరవాత గ్యాప్ తీసుకున్న అజయ్ తన రెండో సినిమాకు మహాసముద్రం అనే టైటిల్‌ ని ఫిక్స్‌ చేశాడు. ఇందులో ఇద్దరు హీరోలు నటించనున్నారు. అయితే ఈ సినిమాలో ఓ హీరోగా శర్వానంద్‌ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చాడు. అధికారిక అనౌన్సమెంట్ చేశాడు అజయ్ భూపతి. శర్వానంద్ తన కెరీర్ లో చేసిన గమ్యం, ప్రస్థానం వంటి బలమైన పాత్రను ఈ సినిమాలోనే చేస్తున్నాడని తెలిపారు. ఈ సినిమాలో యాక్షన్, డ్రామా, లవ్ ఉంటాయని తెలిపారు. అలాగే ఆర్ ఎక్స్ 100 తో హిట్ అందుకున్న అజయ్ ఇప్పుడు అంతకంటే సూపర్ హిట్ సినిమా తీయబోతున్నాడని అన్నారు. కానీ ఇందులో ఉండబోతున్న ఆ రెండో హీరో గురించి మాత్రం ఏ విషయాన్ని తెలుపలేదు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించబోతున్న ఈ సినిమాలో హీరోయిన్‌లుగా.. సాయి పల్లవి, అదితి రావు హైదరి నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ నిర్మించనుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu