HomeTelugu Trending'రంగ మార్తాండా'.. శివాత్మిక ఫస్ట్‌లుక్‌

‘రంగ మార్తాండా’.. శివాత్మిక ఫస్ట్‌లుక్‌

6 18
ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశీలో డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం ‘రంగ మార్తాండా’. మరాఠీ హిట్‌ ‘నటసామ్రాట్‌’ను తెలుగులో రీమేక్‌గా చేస్తున్నారు. నటన నుంచి విశ్రాంతి తీసుకున్న ఓ స్టేజ్‌ ఆర్టిస్ట్‌ విషాదకర జీవితమే ఈ చిత్రం. ఇందులో బ్రహ్మానందం, ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ చిత్రంలోని కీలక పాత్రలో సీనియర్‌ నటుడు రాజశేఖర్‌ కుమార్తె శివాత్మిక నటించబోతున్నారని ఇటీవల ప్రచారం జరిగింది. ఆ వార్తలపై కృష్ణ వంశీ స్పష్టత ఇచ్చారు. ‘ఎంతో నైపుణ్యం ఉన్న, చురుకైన.. ఇద్దరు లెజెండ్స్‌ రాజశేఖర్‌, జీవితల కుమార్తె శివాత్మిక ‘రంగమార్తాండా’లో లవ్లీ కుమార్తెగా నటిస్తున్నారు.. చీర్స్‌’ అని ట్వీట్‌ చేశారు. దీంతోపాటు శివాత్మిక సెట్‌లో ఉండగా తీసిన ఫొటోను షేర్‌ చేశారు. ఆమె ఈ చిత్రంలో వివాహితగా కనిపించబోతున్నారు. ‘దొరసాని’ తర్వాత శివాత్మిక నటిస్తున్న రెండో సినిమా ఇది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu