HomeTelugu Trendingశివాని రాజశేఖర్ ఫస్ట్‌లుక్‌ 'అద్భుతం'!

శివాని రాజశేఖర్ ఫస్ట్‌లుక్‌ ‘అద్భుతం’!

2
టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు రాజశేఖర్ ఇద్దరు కూతుర్లు శివాని మరియు శివాత్మిక రాజశేఖర్ లు సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చేశారు. ఇప్పటికే చిన్నమ్మాయి శివాత్మిక ‘దొరసాని’ అనే సినిమాలో హీరోయిన్ గా నటించి ప్రశంసలు దక్కించుకుంది. ఈ క్రమంలో ఇప్పుడు శివాని రాజశేఖర్ కూడా హీరోయిన్ గా పరిచయం అవుతోంది. కే. మల్లిఖార్జున్ రామ్ దర్శకత్వంలో మహాతేజా క్రియేషన్స్ మరియు ఎస్.ఒరిగినల్స్ కలిసి నిర్మిస్తున్న ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా నటిస్తోంది. నేడు శివాని పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలో ఆమె ఫస్ట్‌లుక్ ని విడుదల చేస్తూ చిత్ర యూనిట్ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ సినిమాలో శివాని ‘వెన్నెల’ అనే పాత్రలో కనిపించనుంది. ఈ పోస్టర్ లో శివాని చాలా అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఇక ఈ చిత్రంతో ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న తేజా సజ్జా హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాకి ‘అద్భుతం’ అనే టైటిల్ ని అనుకుంటున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. ఇక తేజా గతేడాది సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఓ బేబీ’ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu