
Top Trending Movies on Amazon Prime Video:
రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చెంజర్’ థియేటర్లలో ఆశించిన విజయం సాధించలేకపోయిన విషయం తెలిసిందే. సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైనా, ప్రేక్షకుల అభిప్రాయాల ప్రకారం మిశ్రమ స్పందన మాత్రమే వచ్చింది. ఇక సినిమా ఓటీటీలో విడుదలకన్నా ముందే HD ప్రింట్లు లీక్ కావడం సినిమాకు మరింత నష్టాన్ని తెచ్చిపెట్టింది.
ఇలాంటి పరిస్థితుల్లో, ప్రైమ్ వీడియోలో నెంబర్ 1 ట్రెండింగ్ లో ఈ సినిమా నిలవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ జాబితా నిజమైనదా? లేక ఎలాంటి వ్యూహంతో ఇలా లిస్ట్ చేస్తున్నారు? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
ఇది నిజంగా సాధ్యమేనా? కొందరి అభిప్రాయంలో ఓటీటీలో పెద్దగా కొత్త ఇంట్రెస్టింగ్ కంటెంట్ లేకపోవడంతో, పెద్ద స్టార్ హీరో సినిమాలను జనాలు చూడడానికి ఆసక్తి చూపించవచ్చు. పైగా, ఓటీటీలో బాక్స్ ఆఫీస్ ఫలితాలు పెద్దగా ప్రభావం చూపవు. థియేటర్లలో ఫ్లాప్ అయిన కొన్ని సినిమాలు ఓటీటీలో ప్రేక్షకాదరణ పొందిన ఉదాహరణలు చాలా ఉన్నాయి.
అయితే, ఇదంతా జరిగినా కూడా టాప్ 1 పొజిషన్ లో ‘గేమ్ చెంజర్’ నిలవడంపై నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో దీనిపై తీవ్ర చర్చ నడుస్తోంది. ప్రైమ్ వీడియో ట్రెండింగ్ లిస్టుపై నమ్మకం పోయిందని, ఇది వాస్తవాన్ని ప్రతిబింబించదని కొందరు అభిప్రాయపడుతున్నారు.
ఒకవేళ ఓటీటీ వేదికలు కంటెంట్ ప్రమోషన్ కోసం మానిపులేటివ్ లిస్టులను ప్రచారం చేస్తున్నాయా? లేక ప్రేక్షకుల ఆసక్తి నిజంగా ఎక్కువ ఉందా? అన్నది తేలాల్సిన విషయమే. కానీ, ‘గేమ్ చెంజర్’ నెంబర్ 1గా ఉండటం మాత్రం ఆశ్చర్యం కలిగించేదే!