
Telangana Caste Census Results:
Telangana Caste Census Results అధికారికంగా విడుదలయ్యాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన ఈ కుల గణన ఫలితాలను ఆదివారం రోజున బయటపెట్టారు. ప్రణాళిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఈ నివేదికను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీకి సమర్పించారు.
ఈ సామాజిక-ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల (SEEEPC) సర్వే మొత్తం 54,77,554 మంది వ్యక్తులను కవర్ చేసింది. తెలంగాణలో 96.9% కుటుంబాల సమాచారం సేకరించబడింది.
కుల గణనపై తీర్మానం ఫిబ్రవరి 4, 2024 న తీసుకోగా, ఏకంగా ఏడాది లోపే తెలంగాణ ప్రభుత్వం దీన్ని పూర్తిచేసింది. 50 రోజుల్లో ప్రజల నుండి సమాచారం సేకరించి, 36 రోజుల్లో డిజిటైజేషన్ కూడా పూర్తి చేశారు.
తెలంగాణ కుల గణనలో ముఖ్యమైన వివరాలు:
బీసీలు – 46.25% (1,64,09,179)
ఎస్సీలు – 17.43% (61,84,319)
ఎస్టీలు – 10.45% (37,05,929)
ముస్లింలు – 12.56% (44,57,012)
బీసీ ముస్లింలు – 10.08% (35,76,588)
ఓసీ ముస్లింలు – 2.48% (8,80,424)
ఓసీలు – 13.31% (44,21,115)
బీసీలు 56%, ఓసీలు 16%!
ముస్లిం బీసీ, ఓసీ జనాభాను ఆయా విభాగాల్లో కలిపితే:
మొత్తం బీసీలు – 56%
మొత్తం ఓసీలు – 16%
తెలంగాణలో బీసీలే అత్యధికంగా ఉన్నారు. కుల గణన పూర్తయిన నేపథ్యంలో భవిష్యత్‌లో రాజకీయ, విద్య, ఉపాధి రంగాల్లో పెద్ద మార్పులు వచ్చే అవకాశం ఉంది.
ALSO READ: Thandel సినిమా కోసం నాగ చైతన్య తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?