Homeపొలిటికల్Telangana Caste Survey కోసం ఎంత ఖర్చు అయ్యిందంటే

Telangana Caste Survey కోసం ఎంత ఖర్చు అయ్యిందంటే

This much spent on Telangana Caste Survey
This much spent on Telangana Caste Survey

Telangana Caste Survey cost:

తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి కుల జనగణన (Caste Census) నిర్వహించి, దాని వివరాలను అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ప్రవేశపెట్టారు. ఈ సర్వే ప్రజా లెక్కల కంటే మెరుగ్గా నిర్వహించారని ఆయన వెల్లడించారు. ఇది ప్రభుత్వ సంక్షేమ విధానాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికే అని స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్ర జనాభా మొత్తం 3.70 కోట్లు కాగా, అందులో BCs 56% ఉంటారని ఈ కుల జనగణనలో తేలింది. ఇది బిసి వర్గాలకు అవకాశాలు కల్పించేందుకు కీలకంగా మారబోతోందని సీఎం తెలిపారు. ఈ నివేదికను క్యాబినెట్ పూర్తిగా ఆమోదించిందని, కాబట్టి దీనికి ప్రభుత్వ అనుమతి ఉన్న అధికారిక లెక్కలుగా పరిగణించొచ్చని పేర్కొన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడుతూ, భారత్ జోడో యాత్ర సమయంలో రాహుల్ గాంధీ కుల జనగణన నిర్వహిస్తామనే హామీ ఇచ్చారని, తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు దానిని సక్సెస్‌ఫుల్‌గా అమలు చేసిందని అన్నారు. దీనికి ముందు కర్ణాటక, బీహార్ రాష్ట్రాల్లో జరిగిన కుల జనగణనలను అధ్యయనం చేసి, అనేక వర్గాల ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నామని వివరించారు.

ఈ కుల జనగణన మొత్తం 50 రోజులు పాటు నిర్వహించగా, ₹160 కోట్ల ఖర్చుతో ఇది పూర్తయిందని సీఎం తెలిపారు. ప్రతి 150 ఇళ్లను ఒక యూనిట్‌గా తీసుకుని, రోజుకు 10 ఇళ్ల చొప్పున అధికారులు సర్వేను కొనసాగించారని వివరించారు.

గ్రామాలు, పట్టణాల్లో జనగణన వివరాలు:

గ్రామాల్లో – 66.39 లక్షల కుటుంబాలు

పట్టణాల్లో – 45.15 లక్షల కుటుంబాలు

ఈ కుల జనగణన ఆధారంగా, భవిష్యత్తులో వెల్పేర్ పాలసీలు మరింత పారదర్శకంగా ఉంటాయని, పేదల కోసం సరికొత్త కార్యక్రమాలు చేపట్టనున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

ALSO READ: Actor Rajashekar సంపాదించిన దానికంటే పోగొట్టుకున్నదే ఎక్కువ

Recent Articles English

Gallery

Recent Articles Telugu