HomeShort Filmsషార్ట్ ఫిల్మ్ రివ్యూ: థాంక్యూ మిత్రమా

షార్ట్ ఫిల్మ్ రివ్యూ: థాంక్యూ మిత్రమా

fffa

 

సుభాష్(గెటప్ శీను)కు సెల్ఫీ లంటే పిచ్చి. తనకు ఎవరు పరిచయమయిన చాలా తొందరగా
కలిసిపోయే నేచర్ తనది. తన స్నేహితులతో కలిసి ఓ రాక్ బ్యాండ్ ను నడుపుతూ ఉంటాడు.
సుభాష్ బెస్ట్ ఫ్రెండ్ మీరా.. రాక్ బ్యాండ్ షోకు కావలసిన స్పాసర్స్ కోసం తిరుగుతూ ఉంటుంది.
ఈ నేపధ్యంలో సుభాష్ కు ఓ గిటార్ దొరుకుతుంది. ఆ గిటార్ పట్టుకొని ఇంటికి వెళ్ళే సమయంలో
సుభాష్ కు మిత్రమా.. మిత్రమా.. అని ఎవరో మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. కొద్దిసేపటి
తరువాత ఆ మాటలు గిటార్ నుండి వినిపిస్తున్నాయని తెలుసుకుంటాడు. ఆ గిటార్ సుభాష్ తో
కొన్ని విషయాలను చెప్పాలనుకుంటుంది. అసలు గిటార్ మాట్లాడడం ఏంటి..? ఇంతకీ
ఆ గిటార్ సుభాష్ తో ఏం చెప్పాలనుకుంటుంది..? అనే విషయాలతో ‘థాంక్యూ మిత్రమా’
లఘు చిత్రం నడుస్తుంది.
ప్లస్ పాయింట్స్:
ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్
నేపధ్య సంగీతం
కథ, కథనం
ఫోటోగ్రఫి
మైనస్ పాయింట్స్:
విజువల్ ఎఫ్ఫెక్ట్స్
విశ్లేషణ:
ఇద్దరు మధ్య స్నేహం ప్రేమగా మారడం, కొన్ని కారణాలతో ఆ ప్రేమకు గుడ్ బై చెప్పేసి
ఎవరి జీవితాలు వారు గడపడం వంటి కాన్సెప్ట్స్ తో చాలా కథలు వచ్చాయి. కానీ
థాంక్యూ మిత్రమా ప్రత్యేకత ఏంటంటే.. ప్రేమ నుండి దూరమయినా.. స్నేహాన్ని మాత్రం
వదలకూడదు అని చెప్పడమే.. యాంకర్ రవి ఇప్పటివరకు మంచి యాంకర్ అని మాత్రమే
మనకు తెలుసు. కానీ తనలో మంచి నటుడు కూడా ఉన్నాడని ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా
నిరూపించుకున్నాడు. శ్రీముఖి నటిగా అందరికీ పరిచయమే.. అయితే ఓ కామన్ అమ్మాయిగా
ఈ షార్ట్ ఫిల్మ్ లో అధ్బుతమైన నటనను కనబరిచింది. గెటప్ శీను మొదటిసారిగా కాస్త
సీరియస్ రోల్ లో నటించాడు. తన నటన కూడా ఈ షార్ట్ ఫిల్మ్ కు ప్లస్ గా మారింది. రాకేశ్
సిల్వర్ అనుకున్న కథను చక్కగా ప్రెజంట్ చేయగలిగాడు. ఇద్దరి మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు
బాగా డీల్ చేశారు. కానీ గిటార్ మాట్లాడడం అనేది మాత్రం కొందరికే డైజిస్ట్ అవుతుంది.
ఆర్కే నల్లమ్ నిర్మాణ విలువలు బావున్నాయి. కార్తీక్ శర్మ మ్యూజిక్, ఉన్ని కృష్ణన్ ఫోటోగ్రఫి
షార్ట్ ఫిల్మ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్ళాయి. విజువల్ ఎఫెక్ట్స్, డి.ఐ ఇంకాస్త బాగా
చేయగలిగితే బావుండేది. మొత్తానికి యూత్ ను మెప్పించే సినిమా అని చెప్పొచ్చు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu