HomeTelugu Trendingబిగ్‌బాస్‌ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన బ్యూటీ

బిగ్‌బాస్‌ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన బ్యూటీ

Shraddha das clarity on bi
తెలుగులో బిగ్‌బాస్ సీజన్ 4 అసలు ఉంటుందా..? ఉండదా..? అని అనుమానాలు వ్యక్తం నేపథ్యంలో అందరి అనుమానాలకు క్లారిటీ ఇస్తూ.. స్టార్ మా బిగ్‌బాస్ 4కు సంబంధించిన ప్రోమో విడుదల చేసింది. అయితే సీజన్‌-4కు కూడా నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్నాడు. ఇప్పటికే నిర్వాహకులు కొంత మంది సెలబ్రిటీలను లిస్ట్ ఔట్ చేసింది. కానీ వారెవరనేది మాత్రం రివీల్ చేయలేదు. అయితే కొంతమంది కంటిస్టెంట్స్ పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. వాటిలో హాట్‌ బ్యూటీ శ్రద్దదాస్ పేరు కూడా ఉంది. దీనిపై తాజాగా శ్రద్ద స్పందించింది. బిగ్‌బాస్ సీజన్‌-4 కోసం తనను ఎవరూ సంప్రదించలేదని, తాను అందులో పాల్గొనడం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు శ్రద్ధాదాస్‌ ట్విటర్‌లో ఒక పోస్ట్‌ చేసింది. అంతే కాకుండా ఇకపై తన గురించి అసత్యపు వార్తలు ప్రచారం చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది
ఈ బ్యూటీ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu