HomeTelugu Newsటాలీవుడ్‌లో మరోసారి బంపర్ ఆఫర్‌ కొట్టేసిన శృతిహాసన్‌

టాలీవుడ్‌లో మరోసారి బంపర్ ఆఫర్‌ కొట్టేసిన శృతిహాసన్‌

16 2
టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఒక రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకుంది శృతి హాసన్. వరుసగా వస్తున్న అవకాశాలు తిరస్కరించేసి బాలీవుడ్ కి వెళ్లింది. అక్కడ కుదురుకుంటున్న సమయంలోనే ప్రేమలోపడటం .. కెరియర్ ను నిర్లక్ష్యం చేయడం జరిగాయి. ప్రియుడు హ్యాండ్ ఇచ్చాక శ్రుతి హాసన్ ఈ లోకంలోకి వచ్చింది. అప్పటి నుంచి ఆమె కెరియర్ పై దృష్టిపెట్టింది.

హిందీతో పాటు తెలుగులోను సినిమాలు చేయడానికి శృతి హాసన్ ఉత్సాహాన్ని చూపుతోంది. ఈ నేపథ్యంలోనే రవితేజ – గోపీచంద్ మలినేని సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. అలాగే మహేష్‌ బాబు తదుపరి సినిమాలోను అవకాశాన్ని దక్కించుకుందనేది తాజా సమాచారం. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా నిర్మితం కానుంది. మహేష్‌ బాబుతో చేయడానికి చాలామంది హీరోయిన్లు పోటీపడుతుంటే, ఇంత గ్యాప్ తీసుకున్న శృతి హాసన్ కి మరోసారి ఆయన జోడీగా అవకాశం లభించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయంగానే చెప్పుకోవాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu