HomeTelugu Newsసిమ్రాన్ ఫిట్‌నెస్‌కి కారణం అదేనట..!

సిమ్రాన్ ఫిట్‌నెస్‌కి కారణం అదేనట..!

7 16సీనియర్‌ నటి సిమ్రాన్.. కెరీర్‌ పీక్‌లో ఉన్నప్పుడు పెళ్లిచేసుకుని సినిమాలకు దూరమైంది. ఆ తరువాత కొన్నేళ్లు టీవీ సీరియల్స్‌లో మురిపించి.. మళ్లీ బ్రేకిచ్చింది. కాస్త విరామం తీసుకుని ‘పేట’తో మళ్లీ తెరపైకి వచ్చింది. వయసు పెరిగినా అదే గ్లామర్‌ను మెయింటెయిన్‌ చేస్తూ ఫాన్స్‌ను ఫిదా చేసింది. ఆమెను ఈ సినిమాలో చూసిన వారంతా ‘సిమ్రాన్‌ అప్పుడెలా ఉందో.. ఇప్పుడూ అలానే ఉంది’ అంటూ ప్రశంసించారు. ఆహారం, వ్యాయామం, యోగాతోపాటు డ్యాన్స్‌… ఇవే తన ఫిట్‌నెస్‌ రహస్యాలు అని చెబుతోంది సిమ్రాన్‌. వారంలో నాలుగురోజుల పాటు రెండు గంటల చొప్పున మాస్టర్‌ సమక్షంలో డ్యాన్స్‌ చేస్తానని చెప్పుకొచ్చింది. మనసు ప్రశాంతంగా ఉంచుకుంటూ.. ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ఎల్లప్పుడూ ఫిట్‌గా ఉండొచ్చని సిమ్రాన్‌ చెబుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu