భయపెట్టడం మాకూ తెలుసు: స్పైడర్

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సంధర్భంగా.. బుధవారం ఉదయం ఆయన తాజా చిత్రం ‘స్పైడర్’ రెండో టీజర్ ను విడుదల చేశారు. ఇప్పుడు యూట్యూబ్ లో ఈ టీజర్ లో హల్ చల్ చేస్తోంది. ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో ఈ టీజర్ ను విడుదల చేశారు. తమిళంలో కూడా మహేష్ బాబు డబ్బింగ్ చెప్పడం విశేషం. టీజర్ ను బట్టి ‘స్పైడర్’ సోషల్ మెసేజ్ తో కూడిన త్రిల్లర్ సినిమా అని తెలుస్తోంది. హారీస్ జయరాజ్ నేపధ్య సంగీతం చాలా బాగుంది. ‘ఆరోజు అంతమంది జనంలో నువ్వు దాక్కున్నావే అదే భయం.. భయపెట్టడం మాకూ తెలుసు’ అంటూ మహేష్ చెప్పిన డైలాగ్ తో టీజర్ ముగుస్తుంది. ఈ సినిమాను మురుగదాస్ డైరెక్ట్ చేస్తోన్న సంగతి తెల్సిందే.
ఠాగూర్ మధు సమర్పణలో ఎన్‌వీ ప్రసాద్, రిలయన్స్ ఎంటర్‌మైంట్ సంస్థలు సంయుక్తంగా స్పైడర్ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరో మహేష్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఎస్.జె. సూర్య విల‌న్‌గా క‌నిపించ‌నున్నాడు. సెప్టెంబర్ 27న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.