HomeTelugu Trendingయువ గాయకుడు మృతి

యువ గాయకుడు మృతి

Singer died in car accident

సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో యువ గాయకుడు దుర్మరణం పాలయ్యాడు. అమృత్‌సర్ సమీపంలోని జండియాలా గురులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ పంజాబీ గాయకుడు దిల్జాన్ మరణించాడు. ఈయన వయసు కేవలం 31 సంవత్సరాలు మాత్రమే. అమృత్‌సర్ నుండి కర్తార్‌పూర్ వెళ్తుండగా అతని వాహనం ప్రమాదానికి గురైంది. ఈ యాక్సిడెంట్‌లో అక్కడికక్కడే మరణించాడు దిల్జాన్. రోడ్డు పక్కన ఆపి ఉంచిన ట్రక్కును దిల్జాన్ కారు ఢీ కొట్టింది. దిల్జాన్ భార్య, పిల్లలు కెనడాలో ఉన్నారు. ఈ గాయకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కారు యాక్సిడెంట్ సమయంలో అధిక వేగంతోనే ఉందని తెలిపారు పోలీసులు. దిల్జాన్ ఆకస్మిక మృతితో పంజాబీ సంగీత పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఆయనకు చాలా మంది సంగీత ప్రముఖులు సోషల్ మీడియాలో నివాళి అర్పిస్తున్నారు. ఈయన మరణం పంజాబీ సినీ పరిశ్రమకు తీరనిలోటు అంటూ కన్నీరు పెడుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu