HomeTelugu Trendingబాలు గారి నా వల్ల కరోనా రాలేదు

బాలు గారి నా వల్ల కరోనా రాలేదు

Singer Malavika Clarity onలెజెండరీ సింగర్ ఎస్‌.పి. బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం కరోనా కార‌ణంగా ఈ నెల 5న చెన్నై ఎంజీఎం హాస్పిట‌ల్‌లోచేరారు. ఆయనతో పాటుగా టాలీవుడ్ సింగర్స్ సునీత, మాళవిక కూడా కరోనా బారిన పడ్డారు. ఇటీవల వారు ఓ టీవీ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. అందులోనే వారికి కరోనా సోకినట్టుగా సమాచారం. అయితే మాళవిక కారణంగానే ఎస్పీబీకి కరోనా సోకింది అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. కానీ ఈ విషయం పై స్పందించిన మాళవిక … ఎస్పీబీకి ఈ నెల 5న కరోనా సోకింది. కానీ నాకు ఈ వైరస్ సోకినట్లు ఈ నెల 8 న తెలిసింది. కాబట్టి నా వల్ల ఆయనకు కరోనా సోకింది అనేది అసత్య ప్రచారం అని తెలిపింది. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉన్న మాళవిక.. త‌న‌తో పాటు త‌న రెండేళ్ల కూతురికి, త‌ల్లిదండ్రుల‌కి కూడా క‌రోనా సోకిన‌ట్టు తెలిపిన సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu