పాట పాడాలంటే నైట్ నాతో గడపాలి అన్నాడు: సింగర్ ప్రణవి

టాలీవుడ్‌ క్యాస్టింగ్ కౌచ్.. హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకు మాత్రమే కాకుండా పాటలు పాడే సింగర్స్‌ని కూడా వదిలిపెట్టడం లేదు. పాట పాడాలంటే తనతో పడుకోవాలంటూ ఓ దర్శకుడు తనతో అసభ్యకరంగా మాట్లాడాడంటూ సింగర్ ప్రణవి ఆచార్య సంచలన విషయాన్ని బయపెట్టింది. ఈ మధ్యకాలంలో ఓ యూట్యూబ్ ఛానల్‌కి తన భర్త రఘ మాస్టర్ (కొరియోగ్రాఫర్)తో కలిసి ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రణవి తన చేదు అనుభవాన్ని బహిర్గతం చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘మీటూ’ లాంటి అనుభవం నాకూ ఎదురైంది. నువ్వు సినిమాలో పాట పాడాలి అనుకుంటే నాతో ఉండాలి .. నైట్ నాతో గడపాలి అని నీఛాతినీచంగా మాట్లాడాడు ఓ దర్శకుడు. నీ వయసు ఏంటి? నా వయసు ఏంటి? చెప్పుతీసుకుని కొడతా అని చెప్పా.

నేను ఇంటర్మీడియట్ చదువుతున్నా.. పైగా మీకు కొత్తగా పెళ్లైంది కూడా. ఏం మాట్లాడుతున్నారు అంటే.. పెళ్లై మూడు నెలలు అయిపోయింది కదా.. రా అన్నాడు. చెప్పుతో కొడతా ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే. నేను అవకాశం ఇవ్వండని మీ దగ్గరకు రాలేదు. మీరే పిలిచారు అని చెప్పా. నాకు అవసరం లేదు అని చెప్పేశా. అప్పటి నుండి ప్రణవి అంటే దూరంగానే ఉన్నారు. నేను ఆఫర్స్ కోసం వెళ్లినప్పుడు అక్కడ పరిస్థితిని అర్ధం చేసుకుని వెంటనే అక్కడ నుండి వచ్చేసేదాన్ని. నేను ఒక ఆడపిల్లని. నాకో గౌరవం ఉంటుంది. నన్ను ఏమైనా అంటే ఊరుకోను. కాలర్ పట్టుకుని కొట్టడానికైనా వెనకాడను. ఇక రఘుతో పెళ్లైన తరువాత నా జోలికి ఎవరూ రాలేదు అంటూ చెప్పుకొచ్చింది సింగర్ ప్రణవి ఆచార్య.

మా టీవీ సూపర్ సింగర్‌తో ఫేమస్‌ అయిన ప్రణవి టాలీవుడ్‌లో యమదొంగ చిత్రంలోని రబ్బరు గాజులు పాటతో బాగా ఫేమస్ అయ్యారు. అదే సినిమాలో యంగ్ యమా పాటను కూడా పాడారు. వీటితో పాటు.. శ్రీరామదాసు, జెంటిల్మెన్, లోఫర్, పెళ్లి చూపులు, ఒక మనసు, హ్యాపీ డేస్ తదితర చిత్రాల్లో పాటలు పాడారు.

CLICK HERE!! For the aha Latest Updates