HomeTelugu Trendingగాయని సునీతకు పుత్రికోత్సాహం

గాయని సునీతకు పుత్రికోత్సాహం

Singer Sunitha with daughte

ప్రముఖ గాయని సునీత కుమార్తె శ్రేయ కూడా గాయనిగా మారబోతున్నారు. నేపథ్య గాయనిగా, డబ్బింగ్ కళాకారిణిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సునీతకు ఇటీవల వ్యాపారి రామ్‌ వీరపనేనితో వివాహం జరిగిన సంగతి తెలిసిందే. సునీత‌కు ఇప్పటికే ఒక అబ్బాయి, అమ్మాయి ఉన్నారు. వారిద్ద‌రూ సంగీతంపై ఆస‌క్తిని చూపుతున్న‌ట్లు సునీత ప‌లు సంద‌ర్భాల్లో వెల్లడించారు. తాజాగా తన కుమార్తె శ్రేయ పాడిన ఒక మెలోడీ సాంగ్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు సునీత. డియ‌ర్ కామ్రేడ్ చిత్రంలో సిధ్‌ శ్రీరాం పాడిన ‘కడలల్లే వేచే పాట’ బిట్‌ను మ్యూజిక్‌ ఇన్‌ ద ఫ్యామిలీ అంటూ తన పుత్రికోత్సాహాన్ని ఇన్‌స్టాలో షేర్ చేశారు. తల్లిలా తాను కూడా సింగర్‌గా కెరీర్‌ను తీర్చిదిద్దుకునేందుకు శ్రేయ ముందుకెళ్తున్నట్టు అనిపిస్తోంది.

https://www.instagram.com/p/CMhUYHehZWe/?utm_source=ig_web_copy_link

Recent Articles English

Gallery

Recent Articles Telugu