HomeTelugu Big Storiesసీతారామం: ట్రైలర్‌ విడుదల

సీతారామం: ట్రైలర్‌ విడుదల

Sita Ramam Trailer

హీరో దుల్కర్ సల్మాన్.. మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన తాజా చిత్రం ‘సీతా రామం’. యుద్ధంతో రాసిన ప్రేమకథ అనేది దీనికి ఉపశీర్షిక. హను రాఘవపూడి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాని… వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మిస్తున్నారు.

తెలుగు తమిళం మలయాళం భాషల్లో ఏకకాలంలో రూపొందిన ‘సీతారామం’ సినిమా ఆగస్ట్ 5న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రమోషనల్ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలో ఈరోజు సోమవారం హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించిన ఈవెంట్ లో ట్రైలర్ ను లాంచ్ చేశారు. ఆద్యంతం ఆసక్తికరంగా ఎమోషనల్ గా సాగిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సుమంత్, గౌతమ్ మీనన్, ప్రకాష్ రాజ్, భూమికా చావ్లా, శత్రు – సచిన్ ఖేడేకర్ – మురళీ శర్మ – వెన్నెల కిషోర్ – జిషు తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు. ఈ ట్రైలర్.. సినిమాపై అంచనాలు రెట్టింపు చేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu