‘సాహో’ ప్రీ రిలీజ్‌ వేడుకకు భారీ ఏర్పాట్లు

యంగ్‌ హీరో ప్రభాస్‌ నటించిన ‘సాహో’ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకకు భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామోజీఫిల్మ్‌ సిటీ ఈ కార్యక్రమానికి వేదికైంది. ఈ సందర్భంగా ఫిల్మ్‌సిటీలో 60 అడుగుల ప్రభాస్‌ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ‘సాహో’ సినిమాలోని ఆయన స్టిల్‌ను కటౌట్‌గా రూపొందించారు. ఈ మేరకు తీసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.

‘సాహో’ సినిమాకు సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రద్ధాకపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. నీల్‌ నితిన్‌ ముఖేష్‌, జాకీ ష్రాఫ్‌, వెన్నెల కిశోర్‌, అరుణ్‌ విజయ్‌, మందిరా బేడీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లోనూ ఏకకాలంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం ట్రైలర్‌కు విశేషమైన స్పందన లభించింది. అత్యధిక వ్యూస్‌తో రికార్డు సృష్టించింది.