
బోయపాటి శ్రీను డైరెకక్షన్‌లో పోతినేని రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘స్కంద’. టాలీవుడ్ మోస్ట్ వాటెండ్ బ్యూటీ శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల కానుంది.
ఇప్పటికే విడుదలైన టీజర్, టైటిల్ గ్లింప్స్ తో రెండు పాటలకు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా నుంచి తాజాగా మరో అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ తేదీ, వేదిక ఖరారయ్యాయి. ఈ నెల 26న హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగే భారీ ఈవెంట్‌లో ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు.
తమన్ సంగీతం అందిస్తున్న సినిమాను జీ స్టూడియోస్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. రామ్ హీరోగా నటస్తున్న తొలి పాన్‌ఇండియా సినిమా ఇది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి.













