స్నేహితుడి కోసం నాని గెస్ట్ రోల్!

nani1

నాని, అవసరాల మంచి స్నేహితులు. వీరిద్దరు కలిసి రెండు సినిమాల్లో కూడా నటించారు.
త్వరలోనే నాని, శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడని టాక్. ఇది
ఇలా ఉండగా.. ప్రస్తుతం శ్రీనివాస్ అవసరాల ‘జ్యో అచ్యుతానంద’ అనే చిత్రాన్ని రూపొందించాడు.
నారా రోహిత్, నాగశౌర్య, రెజీనా ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రంలో నాని ఓ గెస్ట్ రోల్ లో
కనిపించనున్నాడనేది తాజా సమాచారం. ఓ కీలకమైన సన్నివేశంలో నాని ఎంట్రీ ఉంటుందట.
వారాహి బ్యానర్, శ్రీనివాస్ అవసరాల పట్ల ఉన్న అనుబంధం కారణంగానే నాని గెస్ట్ రోల్ లో
నటించడానికి అంగీకరించారని సమాచారం. మరి నాని తన పాత్రతో సినిమాకు ఎంతవరకు
ప్లస్ అవుతాడో.. చూడాలి!