HomeTelugu Trending'సోడాల శ్రీదేవి' ఇంట్రో వీడియో వచ్చేసింది

‘సోడాల శ్రీదేవి’ ఇంట్రో వీడియో వచ్చేసింది

Sodala Sridevi Intro Teaser

హీరో సుధీర్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. ‘పలాస 1978’ డైరెక్టర్‌ కరుణ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. టైటిల్ తోనే ఆసక్తిని కలిగించిన ఈ సినిమా.. ఫస్ట్ లుక్ – గ్లిమ్స్ తో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. అలానే ఇటీవల విడుదల చేసిన ‘మందులోడా’ మాస్ కా బాస్ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో సుధీర్‌ బాబు సూరిబాబు పాత్రలో కనపిస్తున్నాడు. ఈ క్రమంలో హీరోయిన్ ‘సోడాల శ్రీదేవి’ పాత్రకు సంబంధించిన ఇంట్రో వీడియో రిలీజ్ చిత్ర బృందం విడుదల చేశారు.

ఈ సినిమాలో సోడాల శ్రీదేవి పాత్రలో ఆనంది కనిపిస్తోంది. బస్ స్టాప్, జాంబిరెడ్డి వంటి తెలుగు సినిమాల్లో నటించింది ఆనంది. తమిళ నాట స్టార్ స్టేటస్ అందుకుంది. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. పావెల్ నవగీతన్, నరేష్, సత్యం రాజేష్, రఘుబాబు, అజయ్, హర్షవర్ధన్, సప్తగిరి, రోహిణి ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu