HomeTelugu Trendingనితిన్‌ 30వ సినిమా రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

నితిన్‌ 30వ సినిమా రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Nitin 30th Movie Release Da

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నితిన్ హిందీలో సూపర్ హిట్ అందుకున్న ‘అంధాదున్’ మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై ఎన్.సుధాకర్ రెడ్డి, నికిత రెడ్డిలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది నితిన్ 30వ సినిమా. ఈ చిత్రంతో నభా నటేష్ హీరోయిన్, మిల్కీ బ్యూటీ తమన్నా కీలక పాత్ర లో నటిస్తుంది. నితిన్ ఈ చిత్రంలో పియానో ప్లేయర్ గా కనిపించనున్నారు. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ దుబాయ్ లో ప్రారంభమైంది. తాజాగా ‘నితిన్30’ చిత్రాన్ని జూన్ 11న వరల్డ్ వైడ్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సందర్భంగా రిలీజ్ అనౌన్సమెంట్ పోస్టర్ ని వదిలారు. ఇందులో నితిన్ పియానో ప్లే చేస్తూ కనిపిస్తున్నాడు. ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతం సమకూరుస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu