HomeTelugu Newsమహేష్‌ సినిమాలో ఆపాట చేయనని చెప్పిన సోనాక్షి!

మహేష్‌ సినిమాలో ఆపాట చేయనని చెప్పిన సోనాక్షి!

14 6సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా నటిస్తున చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్ స్టైల్ .. అనిల్ రావిపూడి మార్కుకి తగినట్టుగానే ఈ సినిమా సాగుతుందట. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం ఈ సినిమా షూటింగు చకచకా జరిగిపోతోంది. రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో తమన్నా ఒక ప్రత్యేక గీతంలో అలరించనున్న సంగతి తెలిసిందే.

ముందుగా ఈ స్పెషల్ సాంగ్ కోసం సోనాక్షి సిన్హాను సంప్రదించారట. సాంగ్ తనకి పంపిస్తే వినేసి .. ఆ తరువాత తన నిర్ణయం చెబుతానని ఆమె అన్నట్టుగా సమాచారం. అయితే సాంగ్ రెడీ కాలేదని.. ఈ పాటను చివరి షెడ్యూల్లో చిత్రీకరిస్తామని అన్నారట. సాంగ్ వినకుండా తన నిర్ణయాన్ని చెప్పలేనని సోనాక్షి తేల్చి చెప్పడంతో, తమన్నాను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తోన్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu